Wednesday, October 25, 2006

ఇంక సెల్లు ఫొను లొ ఫ్రీ గా కబుర్లు..

మీరు ఎప్పుడన్నా అనుకున్నరా, మీ సెల్లుఫొను నుండి కావలసినంత ఫ్రీ గా మాట్లాడుకుంటె బాగుండెది అని?
Vonage కంపనీ ప్రాచుర్యం చేసిన VOIP సాంకేతిక నైపుణ్యం ని వుపయొగించుకునే సెల్లుఫొను ని ఇప్పుడు t-mobile మార్కెట్ లొ కి ప్రవేశపెట్టబొతుంది...

ఈ కొత్త ఫొను తొ మీ ఇంట్లొ లేక హాట్-స్పొట్ లొ వున్నప్పుడు, మీ ఇష్టం వచి నట్టు ఎంత సేపయినా ఫ్రీ గా మాట్లాడు కొవచ్చు. ఇంక వేరె ఎక్కడ అయినా మామూలు సెల్లు ఫొను లాగ ఉపయొగించవచ్చును..ప్రస్తుతం అమెరికా లొ ని seattle లొ trial నడుస్తున్న ఈ విప్లవము త్వరలొ అందరికి అందుబాటులొ వస్తాది.
వివరలకు...
http://www.theonlyphoneyouneed.com/

ఇది ఇలాగ వుంటె, ప్రస్తుతం windows mobile pocket PC ఫొను తొ wi-fi వుంటె, skype తొ ఫ్రీ గా మాట్లడవచ్చు...
https://developer.skype.com/WindowsMobileSkype

technology all the way..

Thursday, October 19, 2006

జనని, జన్మ 'భూమీ

నేను ఈరొజు ఈనాడు లొ ఒక వ్యాసం చదివాను. నన్ను చాల అలొచింపచెసిన వ్యాసం అది..నేను చాల అలొచించాను తరువాత, అసలు నేను ఈ భూమి కి ఎమన్న వుపయొగపడుతున్నానా అని.

ఈ వ్యాసం చదవక ముందే, ఈ మధ్యన మా కార్యలయము లొ నా సహచరులు కొందరము కలిసి 'స్పందనా' అని ఒక బౄందము గా ఏర్పడ్డము. మా బౄందము లొ వాళ్ళు అందరూ ప్రతీ నెల ఎంతొ కొంత వీలు అయినంత డబ్బులు ప్రొగు చెసి ఎవరికయిన అవసరము అయిన వాళ్ళకి ఇద్దాము అని అలొచన. ఆ మధ్య మేము ఈనాడు లొ వచ్చిన కొన్ని ఆర్ధిక సహాయ వార్తలకి పంపిన ఈ-మెయిలు కి ఇంతవరకు సమాధానం రాలేదు.

ఈ వ్యాసము చదివిన ఎవరయిన ఎమన్నా మంచి సలహాలు(మేము సహాయం చెయ్యటానికి) వుంటె ఇవ్వమని నా చిన్న మనవి.

పయిన వార్త చదివిన తరువత అని పిస్తుంది, సంఘ సేవతొ మెము మా చదువుకి కొంచం లొ కొంచం సార్ధకత చూపగలం అని.


Hats off to you 'Bhoomi'.

Wednesday, October 18, 2006

వెబ్2.0

ఈ మధ్య నీకు వెబ్2.0 తెలుసా అని అడగటం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపొయింది. అసలు ఎమిటి ఈ వెబ్2.0?...అందరు ఎందుకు దీని గురించి ఇంత మాట్లాడుకుంటున్నారు?

దీని మీద ఒక నిర్దిస్టమయిన definition లెక పొయినా,నాకు తెలిసినంత వరకు, ఇది ప్రస్తుతం latest technologies కి సంబంధించిన Ajax,Blogs, Wiki's, etc సమాహారం.

Google మొదలు పెట్టిన ఈ విప్లవం మీద ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి.....ఇందులొ ప్రత్యేక మయిన విశేషం ఎమిటి అంటే, "User is the king and customization is the in thing" అని చెప్ప వచ్చు. User తనకి ఎమి కావాలొ అది చెసుకొనే వీలు కల్పించటం...For e.g

బ్లొగ్స్ - ప్రస్తుతం నేను నా ఇస్టం వచినట్టు అభిప్రాయం వెల్లడించుకొవటానికి blog ని వాడుతున్నను, blogger ఒక platform provide చెసింది నాకు అంతే...సొ, ఇక్కడ blogger వెబ్2.0 compliant అని చెప్పవచు.

అలాగే, ప్రస్తుతం Yahoo mail, Windows live platforms వాడుతున్న Ajax Technologies కూడా,User కి మంచి బ్రౌసింగ్ experience ఇవ్వటానికి వాడుతున్న వెబ్2.0 technologies.

రాబొవు రొజుల్లొ అందరు వాడే/వాడబొయే ఇంకొక మంచి website(ఇది కూడ వెబ్2.0 లొ బాగమే)wikipedia.ఇక్కడ కూడ "user is the king". ఎవరయినా ఎమన్నా దేని గురించి అయినా రాయవచ్చు మార్చవచ్చు.

Saturday, October 14, 2006

ఇంటర్నెట్ లొ రాబొవు విప్లవం



మొన్నటి వరకు ఇంటెర్నెట్ లొ సర్చ్ కి పర్యాయ పదము గా మారిన Google కంపెనీ ఇప్పుడు తన విల్లు ని ప్రత్యర్థి Microsoft ఆయువు పట్టు అయిన Office Applications మీదకి ఎక్కుపెట్టింది.Google కంపేని నుండి వచ్చిన Maps, froogle, news లాగ ఇది కూడ తప్పకుండ ఒక విప్లవము స్రుస్టిస్తుంది అని పరిశీలకులు భావిస్తున్నారు. వీటి యొక్క గొప్పతనం ఎమిటి అంటే, Office application ని ఇంటెర్నెట్ లొ సమర్పించ గలటం. ప్రస్తుతం Google Docs బీటా లొ వున్నది,ఆహ్వానితులకి మాత్రమె ట్రై చెసే అవకాశం ఇచ్చారు. నాకు వచ్చిన ఆహ్వనం తొ నేను కూడా ఒక సారి Google Docs(pitched against MS Word) ని మరియు Google Spreadsheets(pitched against MS Excel) ట్రై చెసను. చాల బాగున్నయి కాని ప్రస్తుతం ఇవి చాల బేసిక్ గా వున్నయి.

చెప్పాలి అంటె Zoho అనే కంపనీ వీటికంటె మంచి అఫిస్ ని ఇంటెర్నెట్ లొ ఫ్రీ గా ఇస్తుంది. బాగుంది కూడా.
ఈ విశాల ఇంటెర్నెట్ ప్రపంచం లొ ఎవరు విజయులొ?

Hope the best will survive. Not the strongest.

Friday, October 13, 2006

నింగిని తాకిన స్టాకు మార్కెట్ - వాపా లేక బలుపా?



మరొ సారి స్టాకు మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి.నిన్న సెన్సెక్స్ 12736.42 పాయింట్లు వద్ద ముగిసింది.ఈ పెరుగుదల నిజంగా వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందా లేకా కొంత మంది స్టాక్స్ తొ గాంబ్లింగ్ ఆడుతున్నారా? ఓక్కసారి మన ఆర్థిక రంగం పరిస్థితి చూద్దాం.

పొయిన వారం ఇణ్ఫొసిస్ రెండవ త్రైమాస ఫలితాలు మార్కెట్ ని బాగా ప్రభావితం చేసాయి అని చెప్పవచ్చు.సాఫ్టువేర్ కంపేనీలకి ఇంతకన్న మంచి కాలం ఎప్పుడు లేదు.మౌఖిక వసతులకి సంబందించిన కంపేనీలు అన్ని మంచి ఆర్డరులతొ బిజీ గా వున్నయి.సిమెంట్ కంపేనీలు అన్ని సామర్ధ్యానికి మించి పని చెస్తున్నయి.ఆటొమొబిలు రంగం ప్రతి నెల విడుదల చేసే అమ్మకాల సంఖ్యలు చాలా ప్రొత్సాహకరం గా వున్నయి.మొత్తనికి మన ఆర్థిక రంగం మంచి ఆరొగ్యము గా వుంది అని చెప్పవచ్చు. ౠతుపవనాలు కూడ బాగుంటాయి అని వస్తున్న వార్తలు మార్కెట్ ని పాసిటీవ్ గా ప్రభావితం చేస్తున్నయి.దీన్ని బట్టి ఈ పెరుగుదల కొంచం అర్థిక రంగన్ని ప్రతిబింబిస్తున్నా,కొంచం బలుపు కూడ ఉన్నది అని చెప్పలి. బ్రెజిల్, రష్యా తొ పొల్చుకుంటే మన మార్కెట్లు కొంచం వొవర్ గా ఉన్నాయి అన్నది నిజం.

రానున్న వారాల్లొ మరిన్ని పెద్ద కంపనీలు ఫలితాలు ప్రకటిస్తుండటం తొ చాల మంది ప్రొఫిట్స్ బుక్ చెసుకొవటానికి కొనడము తొ ప్రస్తుతం చాల స్టాకులు కొంచం వుండవలిసిన వాల్యు కి అన్న ఎక్కువ గా ఉన్నాయి. సామాన్య రెటైల్ ఇన్వెస్టర్ మార్కెట్ సద్దుమణిగాక మళ్ళి ట్రడింగ్ లొకి ఎంటెర్ అవ్వటం చాల ఉత్తమం.

రంగుల ప్రపంచం

ఈ మధ్య ఒక సారి ఎందుకొ, నా కెమెరా తొ మంచి ఫొటొస్ తీసి చాలా రొజులు అయింది అనిపించి ఒక సారి అలాగ కెమెరా పట్టుకుని వెళ్ళి దారిలొ నాకు నచ్చిన కలర్స్ ని ఫొటొస్ తీసాను..నిజంగా ఎంత అందమయిన ప్రపంచం?





రింగు రొడ్డు-క్షమాభిక్ష రాజకీయం

ఆంధ్రప్రదేష్ రాజకీయలు రొజు రొజు కి చిన్న పిల్లల కొట్లాటలు అయి పొతున్నయి. నిన్న మొన్నటి వరకు రింగు రోడ్డు అని, భూమి అని తిట్టుకున్న మన నాయకులు, ఈ రొజు ఇంకొక బొమ్మ దొరికేసరికి పాత విషయము(బొమ్మ)గురించి మర్చిపొయారు.
గౌరు వెంకట రెడ్డి క్షమాభిక్ష ఒక పెద్ద కామెడి సినిమా లాగ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టి అధికారం లొకి వచ్చిన తరువాత చేసిన మొదటి తప్పు ఒక ఖైది కి గవర్నెర్ చేత క్షమాభిక్ష పెట్టించడం. రెండొ తప్పు సుప్రీం కొర్ట్ చివాట్లు పెట్టినా, 'చీ' అని దులుపేసుకొవటం. రాజశేఖర రెడ్డి వారు 'సుప్రీం రాజకీయ దుర్వినియొగం జరిగిందని అనలెదు కధ అని అనటం' వారి వితండవాదానికి ప్రతీకాష్ట.

ప్రస్తుత మన పార్టీల పరిస్తితి :

కాంగ్రెస్ పార్టి ఎమో ఎవరు ఎమన్న మాకు ఎమిటి. అధికారం లొ వున్నము, మా ఇస్ట్టము వచినట్టు చెసుకుంటాము మమ్మలని మాట అనె అధికరం ఎవరికి లేదు అని భావం వచ్చెటట్టు ప్రవర్తిస్తుంది.

తెదెపా వాళ్ళు ఇంక కాంగ్రెస్ ఎప్పుడు తప్పు చెస్తుందా అని కాసుకు కూర్చునట్టు కనిపిస్తుంది. ప్రతిపక్ష పాత్ర గురించి చంద్రబాబు కి ఒకసారి ఎవరన్న చెబుతే బాగుండును. బిజెపి వాళ్ళ సంగతి వారికె అర్థం కావటం లేదు.

టి ఆ రెస్ ఒక రాష్ట్రం కొసం పిచ్చ తప్ప ఆ రాష్ట్రం వస్తె ఎమి చెస్తామొ చెప్పె ఒక వివేకమయిన నాయకుడు లేని పార్టి.

ఒక పక్కన రాష్ట్రం లొ ప్రజలు డెంగ్యు జ్వరాలతొ, చిక్కెన్ గున్య తొ బాధ పదుతుంటె మరొక పక్క వీల్లు చిన్న పిల్లలు లాగ తిట్టుకొవతం కొట్టుకొవటం ఎవరికి అయిన చూస్తే నవ్వుకొవాలొ ఎడవాలొ మన దేశ దుస్తిథి చూసి అర్థం కావటం లేదు.

కనీసం కొత్త ఆశలు తొ వస్తున్న జయ ప్రకాష్ 'లొక్ సత్తా అయిన ప్రజల పార్టి అవుతుంది ఎమో వేచి చూద్దాం.

God ...Where am I being taken too?