Wednesday, December 20, 2006

కరంటు కష్టాలు

హమ్మయ్య మాకు కరంటు తిరిగి వచ్చింది. పరిక్షా ఫలితాలు వచ్చి ఫష్టు మార్కులు వచ్చినంత అనందం గా వుంది.
పొయిన గురువారం వాషింగ్టన్ రాష్త్రం లొ వచ్చిన పెద్ద తూఫాను బదితుల్లొ నెను కూద ఒకడిని....మన దెశం లొ లాగా, ఇక్కడ కూడ తూఫాను తరువాత ప్రసాంతత వచ్చింది, విద్యుత్తు పొయింది.
గురువారం పొయిన విద్యుత్తు నిన్న అంటే, అయిదు రొజుల విస్రాంతి తరువాత వచ్చింది. ఈ తూఫాను పుణ్యమా అని మన జీవితాల్లొ విద్యుత్తు ఎంత అల్లుకుపొయిందొ ఇప్పుడు అర్థమయింది.ఇక్కడ ప్రతి పనికి విద్యుత్తు కావాలి..నా జీవితం లొ విద్యుత్తు ఎంతగా అల్లుకుపొయింది అంటే రెండవ రొజు నుండి జీవితం ఇంత కష్టమా అని అనిపించింది.బయట చలి వణికిస్తుంది, ఇంట్లొ హీటెర్ లెదు. ఎవరికి అయిన ఫొను చెధ్ధము అన్న కరంటు లెనిదె అది పనిచెయ్యదు..ఇంటెర్నెట్ లెదు...ఒక్కసరే మా అందరిని ఈ ప్రపంచం నుంది బయటకు గెంటెసారు ఎవరొ అనిపించెది...ఎమన్న తిందాము అంటె, దగ్గర్లొ హొటల్లు అన్ని మూసెసారు, దూరం వెళదాము అంతె కారు లొ ఇందనము కూద అయిపొవటానికి వచింది. పొనే కొట్టిద్దాము అంటె ఒక్క పెట్రొల్ బంకు కూడా తెరవలెదు...పూర్వము మనుషులు ఎలగ బతికెవారు అని కనీసం గంటకు ఒక సారి అయినా అనుకునెవాడిని. అమెరికా కి మనకు వున్న తేడా ఎమిటి అంటె, ఇక్కడ కనీస అవసరాలకి కూడా కరంటు కావలి. మచ్చుకకి..
వంట పొయ్యి, హేటరు, మైక్రొ వేవ్, వాషింగు మేషిను, ఫ్రిజ్జు,ఫొను ఇవన్ని సామన్య అవసరాలు.
సుఖాలకి అలవాటు పడిన దెహలు, కష్టాలు కి తట్టుకొలెవు.నా లాగ.

ఈ రొజు ఇంకా ఒక లక్ష మంది దురద్రుష్టవంతులు వారి క్రిస్మస్ పండుగకి అన్నా విద్యుత్తు వెలుగులు చూస్తాము అని ఎదురు చూస్తున్నరు

Wednesday, December 13, 2006

గూగుల్ లొ అంగారకుడు

గూగుల్ ఏర్థ్ మొదటి సారి చూసినప్పుడు అర్చర్యం తొ పాటు చాల ముచ్చట వేసింది. ఇప్పుడు గూగుల్ అంగారకుడి యొక్క బొమ్మలు కూడ చాల బగా చూపిస్తుంది.చూడాలని వుందా?
లింకు ని నొక్కండి

కాపీ కొట్టు గురూ...

కాపీ కొట్టటం లొ తప్పు లేదు అండి.కాని కొత్తదనానికి, బిన్నత్వానికి మారు పేరు, నేను చాల అభిమానించే గూగుల్ కూడా కాపీ కొడుతుంటె బాద గా వుంది. యాహూ లొ పని చేస్తున్న మా పాత సహ వుద్యొగి పంపినా ఈ బొమ్మలు చూడండి

ఈ కింద బొమ్మలు చూడండి.ఈ విషయం అందరికి తెలిసేసరికి, గూగుల్ ఇప్పుడు తన తప్పు తెలుసుకుని మార్చుకుంది.

Sunday, December 03, 2006

రాములమ్మ-2

మన వీరనారి విజయశాంతి తల్లితెలంగాణ పార్టి కి అసలు ఎవరయిన కేడెర్ వున్నారొ లెదొ తెలియదు కాని తాటాకు చప్పుళ్ళు మాత్రం ఆమె బాగ చెస్తుంది. రాజకీయాలు అంటె సినేమాల్లొ లాగ ఒక రొజులొ కలక్టరు అయిపొవటమొ, లెక పొతె నాలుగు పరుచూరి బ్రదర్సు డయలాగులు చెబుతే సినేమ హాల్లొ చప్పట్లు కొట్టిన ప్రజలు రాజకీయల్లొ కూడా జై జై లొ పలుకుతారు అనుకొవటం అవివేకం. అసలు ఈవిడది తెలంగాణ అవునొ కాదొ కాని మంచి నటి అని మాత్రం ఈ మధ్య ఇస్తున్నా పత్రికా ప్రకటనల్లొ బగా కొట్టుకొచ్చినట్టు కనపడుతున్నాయి. రాజకీయాలని బాగ వంటపట్టించుకున్న ఈవిడ రొజుకొ మాట మాట్లాడుతుంది. ఈవిడ నిజముగా ఒక రాజకీయ అవకాశవాది, తెలంగాణ లొ ఎప్పుదు రాజకీయ వేడి పుడుతుందొ ఎప్పుడే ఈవిడ మాట వినపడుతుంది, లెకపొతే ఈ మేడం గారు చెన్నై లొ ఇంచక్క కాలం గడుపుతూ వుంటారు. ప్రస్తుతం సినెమాలు లేని ఈవిడ వచ్చె కాలం లొ ఆదాయం సంపాదించటం కొసమే తెలెంగాణ ని ఎంచుకున్నారు కాని తెలంగాణా ప్రజలని ఉద్దరిద్దాము అని అయితే కాదు. ఎప్పుడు లెనిది, ఈ సంవత్సరం జరిగిన బొనాలు పండుగ లొ ఈవిడ కనిపించి, TV9 లొ చెన్నై యాస లొ తెలుగు ఒక కొస మెరుపు. తెలంగాణా కు కావలసింది ఇప్పుడు ఒక నిజాయతి, పట్టుదల గల నాయకుడు కాని అవకాశవాదులు, గ్లామర్-తారలు, తల్లులు కాదు. ప్రస్తుతం తెలంగాణా నే వారి వూపిరి అంటున్న నాయకుల్లొ ఒకరు ఎమో పట్టుమని 2 రొజులు కూడ నిరహరదీక్ష చెయ్యలెని వారు ఒకరు, తల్లి కొసం రక్తాభిషెకం చెస్తాము అనె వారు ఒకరు, ఇటలి మేడం కి జలుబు చెసినప్పుడు మనకి తెలంగాణ ఇస్తారు అని మురిసిపొయే చంచా నాయకుడు ఒకరు, ఎప్పుడు చూసిన అందరూ అయన శిష్యులు అంటూ దేముడి మాన్యాలు రాసి ఇచ్చిన పెద్ద మనిషి ఒకరు, మన తల్లి రాములమ్మ ఒకరు.
వీళ్ళని చూసి పొట్టి శ్రిరాములు వుండి వుంటె, సిగ్గుతొ చచ్చిపొయెవారు ఎమొ.