Monday, July 02, 2007

చేతి గడియారం కొనాలా వద్దా?

నాకు చిన్నప్పుడు నుండి ఒక చిన్న కొరిక వుండెది. మంచి చేతి గడియారం కొనుక్కొవాలి అని. కనిపించిన ప్రతి ప్రకటన ని చూసి నా చేతి కి పెట్టుకున్నట్టు వూహించుకుని మురిసిపొయె వాడిని. మా నాన్నగారు అది గమనించారు ఎమొ, నన్ను ఒక సారి తన పాత ’HMT' ని పెట్టుకుని వెళ్ళమని చెప్పారు. నాకు ఎందుకొ అది చాల మొరటు వాచి లాగ అని పించి వద్దు అన్నను. మరి ఆయన ఎమన్నా అనుకున్నారు ఎమొ కాని, నేను పదవ తరగతి మంచి మార్కుల తొ పాసు అయ్యాను అని చెప్పి ’Timex' కొట్టు కి తీసుకుని వెళ్ళి మంచి చెతి గడియారం బహుమతి గా ఇచ్చారు . నాకు ఇంకా బాగ గుర్తు, కనిపించిన ప్రతి వాడికి మొదట నా గడియారం చూపించి తరువాత దెని గురించి అయినా మాట్లాడెవాడిని. దానిని చాలా జాగ్రత్త గా చూసుకుంటూ వుండేవాడిని. రొజు తడి బట్ట తొ తుడవడం, వర్షం వస్తే అది ఎక్కడ తడిసిపొతాదో అని చెప్పి, ఒక ప్లాస్టిక్ సంచి లొ చుట్టి జెబు లొ పెట్టు కొనేవాడిని.

గిర్రున అయిదు సంవత్సరాలు తిరిగిపొయాయి. ఒక శుభ ముహుర్తాన నాకు ఉద్యొగం రావటం తొ, మా అమ్మ నాకు ఈ సారి 'Titan' గడియారం బహుమతి గా ఇచ్చింది.ఇది కొంచం ఎక్కువ ఖర్చు తొ కొన్నాది. నా మొదటి చెతి గడియారనికి కాలం చెసింది ఇంతలొ. . మరుసటి సంవత్సరం, మా చెల్లి రాఖి పండుగ గుర్తు గా ఇంకొక "SPORT" వాచి ఇచ్చింది. సొ మొత్తం మీద రెండు వాచిలతొ కాలం చాలా వెగంగా నడుస్తుండగా, నెను ఒక "smart phone" కొనటం జరిగింది. నా ఫొను ఒక చిన్న కంప్యుటరు ని మరిపించే లాగ వుంటుంది. దాని తెర మీద ఒక చిన్న గడియారం కూడ వుంది. ఇంకా నా గడియారం లొ లేనివి చాలా వున్నాయి.

ఎదొ చికెన్ గున్యా వచ్చి నట్టుగా నా, రెండు గడియారాలు ఒకే సారి మంచం పట్టాయి, తిరగము అని మొరయించుకుని కూర్ఛున్నాయి. నాకు కూడా, "seven year itch" లాగ, నా కొత్త పెళ్ళం, 'Phone' వచ్చిన తరువాతా, నా పాత వాచిల మీద ప్రేమ తగ్గ్గింది. నెను వాటిని బాగుచేయిద్దాం అనే అలొచన చంపేసుకున్నాను. ఇక్కడ వాటిని బాగుచెయ్యటానికి అయ్యే ఖర్చు తొ మనం మన దేశం లొ ఒక్కళ్ళ ఒక సంవత్సరం చదివించవచ్చు. చేతికి గడియారం బరువు లేకుండా ఒక ఆరు నేలలు గడిచాయి..నెమ్మదిగా నాకు చెతి గడియారం ఉపయొగం అసలు కనిపించటం లేదు. కాని ఈ మధ్య మా శ్రీమతి గారి పొరు ఎక్కవా అయింది, చెయ్యి ’యాస’ గా వుంది , మంచి చేతి గడియారం కొనుక్కొండి అని. మనకేమొ ఇప్పటి వరకు అన్ని బహుమతి గా వచ్చినవే తప్ప కొన్నవు కావు. మరి నాకయితే, అలంకార ప్రాయనికి తప్ప చేతి గడియారం ప్రస్తుత కంప్యుటరు యుగం లొ అనవసరం అనిపిస్తుంది.


ఇప్పుడు పెద్ద ప్రశ్న,మా శ్రీమతి కొరిక మన్నించి, కొత్తది కొనాలా వద్దా?

5 Comments:

Blogger రాధిక said...

శ్రీమతి గారి కోరిక మేరకు ఒకటి కొనుక్కుని అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాలలో పెట్టుకుంటూ వుండండి.

8:05 PM  
Blogger Unknown said...

మీ వాచీ సంగతులు నా అనుభవాలకి ఎంత దగ్గరగా ఉన్నాయో. నాకూడా చిన్నప్పుడు వాచీ అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. నాకు మంచి వాచీ టైమెక్స్ దే మా నన్నగారు పదో తరగతి పరీక్షలలో మంచి మార్కులొస్తే కొనిచ్చారు. ఇంకా సూపర్ గా పని చేస్తోంది. కాకపోతే నేనే బాగుందని ఇంకో ఫాస్ట్ ట్రాక్ వాచీ కొనుక్కున్నా ఓ ఏడాదిన్నర ముందు. అప్పటి దాకా ఆ వాచీనే వాడా.

నాకు మాత్రం వాచీ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. వాచీ కొనుక్కోండి బావుంటుంది.

9:40 AM  
Blogger ఉదయ్ భాస్కర్ said...

రాధిక గారికి, ప్రవీణ్ గారికి,
మీ సలహలకి కృతజ్నతలు.నిన్న మా శ్రీమతి ఈ బ్లాగు చదివి, ప్రపంచాన్ని అడగాల వాచ్ కొనటనికి అని ఒక చురక అంటించి, తను నాకు బహుమతి గా ఇస్తాను అని చేప్పింది...ఎంత బహుమతి అయినా నా డబ్బులే అండి :)

11:11 AM  
Blogger ఓ బ్రమ్మీ said...

ఇంతకీ మీ చేతికి గడియారం వచ్చినట్టా .. రానట్టా.. అతరువాత ఈ విషయం మీద ఎటువంటి వార్త ప్రచురితమవ్వలేదు ..

అంతేనా .. లేక మీ శ్రీమతిగారు .. ఇక మీదట ఏ విషయాన్నైనా బ్లాగు చేసావా .. అంటూ మీకు చెక్ పెట్టారా????

ఏది ఏమయినా.. మీరు మాత్రం సుఖంగా ఉంటే.. ఒక చిన్న తిరుగుటపా వ్రాయగలరు.

ఎదురు చూస్తున్న సగటు
భాభ

2:11 AM  
Blogger yanmaneee said...

air max 270
balenciaga shoes
jordan retro
balenciaga shoes
goyard bags
kevin durant shoes
jordan shoes
longchamp
curry 4 shoes
moncler jackets

9:24 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home