Wednesday, November 29, 2006

Simplify

మీరు ఎప్పుడయిన విమానం లొ వెళుతునప్పుడు కిటికి పక్క కుర్చి వస్తే ఎంత బగుంటుందొ అనిపించిన సందర్బాలు అన్ని సార్లు?

మీరు ఈ video చూసాక ఇంకా కూర్చొవాలి అనిపిస్తుంటె మీకు నా వందనములు.

ఇక్కడ జర్గుతున్నది ఎమిటి అంటె, ఎదొ విమానం రెక్క లొ ఒక బాగాన్ని ఒక మాములు టేపు తొ అతికిస్తున్నరు.







ఈ విమానం Air Deccan వారిది అంట, ఇంటెర్నెట్ లొ సేర్చ్ కొడితే నాకు దొరికిన ఈ Video తీసిన అతని బ్లొగ్
మీకు ఇక్కడ ఒక విషయం చెప్పలి, Air Deccan వారి Tag line తెలుసా?? 'Simplify'. భహుస Simplify అంటె ఇదేనేమొ.

Note: I posted this since I found this funny at the same time jittery.But,From what I learnt later, it seems that this is called a 'speed tape' which is quite normally used in aircraft maintenance, but the way it is picturised send jitters down the spine..:). Any reservations on the use of this video could please send an e-mail to me and the blog entry will be removed if copyrighted.

మంచు కురిసే వేళలొ..




గత రెండు రొజుల గా అమెరికా north west లొ విపరీతం గా snow పడుతుంది. బయట ఎక్కడ చూసినా, ఒక తెల్లని దుప్పటి పరిచినట్టు కంటికి చాల ఇంపుగా వుంది. నెను మంచు పడతుండగా నా కెమెరా లొ బందించిన కొన్ని చిత్రాలు..

అనందొ బ్రహ్మా

తెలుగు సినిమా చరిత్ర లొ హస్య నటుల గురించి ఒక పుస్తకం రాస్తే, అందులొ తప్పకుండా, బ్రహ్మానందం గురించి కొన్ని పుటలు వుండాలి. అంతగా అయన తెలుగు ప్రేక్షకుల కి పరిచయం. ఆయన చెసిన కామెడి ని మొదట సారి నా చిన్నప్పుడు 'అహ నా పెళ్ళంటా! ' సినిమా లొ చూసినప్పటి నుండి నేను అయన అభిమాని అయిపొయాను. బ్రహ్మనందం లొ వున్న విలక్షణ లక్షణం ఎమిటి అంటె, అయనా ముఖ కవళికలు సన్నివేశానికి తగట్టుగా, మనకి నవ్వు తెప్పించే విధముగా చెయగలటం.మనము అయన్ని సీరియస్ వెషము లొ కూద నవ్వుకుంటాము, 'అనగనగ ఒక రొజు ' , 'మని ' మొదలగు సినిమా లొ చెసినట్టు. మచ్చుతునకకి నాకు వచ్చిన ఒక ఈ-టపా ని ఇక్కడ అతికించాను.

బ్రహ్మనందం ఒక Software engineer అయితే అయన ముఖ కవళికలు ఎలాగ పెడతారో వూహించుకొని ఒక అభిరుచి గల వారు తయారుచేసిన ఈ post చూసి హాయిగా నవ్వుకొండి.



బెంచ్ మీద వున్న బ్రహ్మనందం





మైంటెనన్సు ప్రొజెక్టు లొ వున్న...అప్పుడప్పుడు పని వుంటుంది




క్లయింటు spelling mistakes మీద management కి e-మెయిలు పంపాడు.






చచ్చాను రా దెముడా!! పొరపాటున పాత build release చెసెసాను



Coding అయిపొయింది, ఇంక రెపటి నుంది testing మొదలు...







నువ్వు raise చెసిన bug fix చెసేసా...దమ్ముంటె ఇప్పుడు bug raise చెయ్




Note : all the images are copied from the e-mail I got. Please let me know if they are copy righted. I will remove them.

Friday, November 17, 2006

మానవ మౄగాలు - స్వార్థ ప్రపంచ రాజకీయలు

రెండు రొజుల క్రితం నేను పని పాడు లేక టి.వి ఆన్ చేసి, నాకు ఈ మధ్య బాగ తగ్గిపొతున్న ప్రపంచ జ్ఞనాన్ని పెంచుకుందాము అనుకున్నాను. కాని చివరకి ఆ ప్రొగ్రాం చూసి చాలా బాద పడి వేమన శతకన్ని కొంచం మార్చి 'మనుషులందు మౄగములు వేరయ్యా' అనుకుంటూ ఎమి చెయ్యలెక నిస్సహయత తొ ఆలాగ అలొచిస్తూ వుండిపొయా.

ఇంతకి నేను చూసిన ఆ ప్రొగ్రాం ఆఫ్రికా ఖండం లొ ని సుడాన్ దెశము లొ ప్రస్తుతం జరుగుతున్న మానవ వూచకొత గురించి. విచిత్రం ఎమిటి అంటె అక్కడి ప్రభుత్వం ఆదీనం లొ జరుగుతుంది ఈ అరాచకం. జజవీద్ అనె ఒక సాయుధ గెరిల్లలు ఈ మౄగాలు. వీల్లకి ఆయుదాలు సుడాన్ ప్రభుత్వం సహయం చెస్తుంది. దీని గురించి ఇంక విపులంగా వికి లొ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరి ఇంత విపరీతం గా మనవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటె, ప్రపంచ పొలిసు గా పిలుచుకునె ఆమెరికా ఎమి చెస్తుంది అని అడుగుతున్నారా?....అదే మరి తెలివి అంటె, ఇక్కడ ఇరాక్ లాగ చమురు లేదు కదండి...

Tuesday, November 07, 2006

కష్టపడే మనుషులు.....

నేను ఆమెరికన్ల లొ ఒక మంచి గుణం చూసాను. అది ఎమిటి అంటె పని మీద ధ్యాస మరియు అంకిత భావం.

నేను వుండె ప్రదేశం లొ గత వారం రొజులుగా పడుతున్న వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం వరదలు వచ్చాయి. ఇక్కడ టి.వి లొ వార్తలు చూస్తుంటే, అసలు వీళ్ళకి మనకి ఎంత తేడా వున్నదొ మనిషి ప్రాణానికి విలువ ఇవ్వటం లొ అనిపిస్తుంది. ఇంత పెద్ద వరదలు మన భారత దేశం లొ వచ్చి వుంటె, ఇప్పటికి చాల మరణాలు సంభవించి వుండెవి.కాని ఇక్కడ ఇప్పటి వరకు ఎవరు మరణించటం కాని తప్పిపొవటం కాని జరుగలెదు. ఈ రొజు తొ వరుసగ ఎడవ రొజు వర్షం పడింది.వాగులు నదులూ అన్ని పొంగి పొర్లుతున్నయి ఇంకా పది రొజులు ఇలాగ వుంటుంది అని అంటున్నరు.వరదలకి తొడు ఎన్నికలు కూడ జరుగుతున్నాయి అయిన ఎవరు ఒకరి మీద ఒకరు తిట్టిపొసుకొవడం కాని, అడిపొసుకొవటం కాని జరగ లెదు, ఎవరి పనులు వాళ్ళు చెస్తున్నారు.ఒక సైన్యం లాగ సాగిపొతున్నరు. మన దగ్గర వరద వచ్చిన తరువాత పక్షం రొజులకి కాని ఒక ఆఫిసర్ కాని కలక్టర్ కాని పలుకరించటానికి రారు.కాని ఇక్కడ వరద రాక ముందే, ఒకసారి పరీక్షకి కి వచ్చి అందరిని సన్నద్దం చెశారు. మన దేశం లొ ఎప్పటికి వస్తుందొ ఇలాంటి క్రమశిక్షణ.మనము అనుకుంటాము మనంత ఎవరు కస్టపడరు అని, కాని నాకు అనిపిస్తుంది వీళ్ళు పద్దతి గా చెస్తారు, కస్టం గా చెయ్యరు.ఒక పని ని యగ్నం లాగ చెస్తారు, ఎవరికయిన సహాయం చెయ్యటనికి చెయ్యి అందిస్తారు.అన్నిటి కన్న పని మీద అంకిత భావం ఎక్కువ.

దీనికి కారణాలు చాలా కావచ్చు, మన దేశ పరిస్తిథులు, మన దేశం లొ వున్న అవినీతి రాజకీయలు, మనం పెరిగిన వాతవరణం, చెప్పుకుంటు పొతే ఇంక చలా చలా
అయిన మన రాజులు బాగుంటే నె కదా ప్రజలు బగుంటారు. యదా రాజ తదా ప్రజా.

చివరిగా కొసమెరుపు..
ఈ రొజు వార్తల్లొ మన ముఖ్యమంత్రి గారు అన్న మాట చూడండి.."అవినీతి మమూలే ...."