Monday, January 29, 2007

తెలుగు వజ్రొత్సవ సంబరాలు - 4.5/5

ఒక మాటలొ : మంచి రసవత్తరమయిన ముగింపు
ఈ కొవ లొ కి వస్తుంది : డ్రామా
బేనెర్‌: మా టి.వి


అనుకున్న విదముగానే భారి తరాగణం తొ మంచి ఆడంబరం తొ బారి ఖర్చు తొ విడుదలయిన ఈ సినిమా,చూసిన వారి అందరికి మొదటి రీలు నుండి కూడ ఆద్యంతం చివరివరకు అలరించి మంచి పాటలు తొ పాటు మన దిగ్గజాల నట విశ్వరూపాలు చూశే అవకాసం కల్పించింది. అన్నిటికన్న మెచ్చుకొ దగినది ప్రతి నయకుడి పాత్ర వెసిన మొహన్‌ బాబు పాత్ర..అయాన ఆ పాత్ర లొ ఎంతా బాగా చెసారు అంటే మనము నిజంగానే అయన్ని అసహ్యించుకునెట్టు చేసారు....ఇంక నాయకుడు విషయానికి వస్తే తప్పనిసరిగా చిరంజీవి బాగ చెసారు అని అనిపించింది కాని మన సినెమాల్లొ నాయకుడు మంచిని చెప్పటానికి అవేశాము లొనుకాకుండా సౌమ్యముగా సమధానం ఇస్తే బగుండును అనిపించింది.మొదటి అర్ధ బాగం చూసి ఎముంది అన్ని సినెమాల్లగనె ఇది కూడ అని నిట్టూర్పు విడుస్తున్న సమయం లొ మంచి ట్విస్ట్‌ తొ మొత్తం కధ అడ్డం తిరిగింది. తెలుగు ప్రెక్షకులకు ఇది తప్పనిసరిగా గుర్థుకు వుంది పొయే సినెమా.

సహ నటుల్లొ అందరికన్న బాలక్రిష్ణ తన వైవిద్యన్ని చాటుకున్నారు. నాగర్జున ఎప్పటి వలే ever cool.

చివరిగా నాకు ఈ మొత్తానికి దర్శకరత్న దాసరి దర్శకుడు ఎమొ అని అనిపిస్తుంది

Monday, January 15, 2007

సంక్రాంతి శుభాకాంక్షలు



మళ్ళి ఒక సంక్రాంతి వచ్చింది ... గత కొన్ని సంవత్సరాలుగా అన్నిపండుగలూ కూడ ఎదొ ఒక ఆదివారం సెలవు దినం లాగ గడిచిపొతున్నయి..మనం అధునీకరణ, అభివౄద్ది అనే ఒక మాయ లొ పడి సంస్కౄతి ని చాలా దూరం చెసుకొంటున్నము అని అనిపిస్తుంది..ఒక సారి నా పాత జ్ఞాపకాలు నెమురవెసుకుంటే మన బావి తరాల వాళ్ళు ఎంత కొల్పొతున్నారొ అని బాద వెస్తుంది.


నా మధురానుబూతులు..


డిసెంబర్ రావటం మొదలు మా సంక్రాంతి హడావిడి మొదలయ్యెది..మా చెల్లి, అమ్మ, ఒక పాత డయిరీ పుస్తకం తీసెవారు...ముగ్గుల డెజయినులు కొరకు..ఆ నెల మొత్తం ఎక్కడ పడితే అక్కడ చుక్కల బాషలొ మాట్లడెవారు. " ఎమండి ఎన్ని చుక్కలు నిలువు ఎన్ని చుక్కలు అడ్డం అండి" అని. దినపత్రిక లొ ఒక ముఖ్యమయిన వార్త దగ్గర పెద్దగా కత్తెర తొ కత్తిరించెసెవారు..అవతల వయిపు తిప్పి చూస్తే, ముగ్గు డిజయిను వుండేది.


నెను మాత్రం ఎప్పుడెప్పుడు పరిక్షలు అవుతాయా అని ఎదురుచూస్తు వుండెవాడిని. అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాము అని ఎదొ తెలియని ఆనందం. వెళ్ళే ముందు,సంక్రాంతి కి ఒక మూడు జతలు అన్నా బట్టలు కుట్టించుకొవటం..లేటెస్ట్ చిరంజీవి సినెమాలొ చిరంజీవి డ్రెస్స్ లాగ...మా దర్జీ కూడ నెను అడిగినట్టు కుట్టెవాడు. మా వూరికి వెళ్ళేటప్పుడు, ముందే మా చెల్లి తొ ఒక ఒప్పందం కుదుర్చుకునే వాడిని. ట్రైను లొ కిటికి దగ్గర వెల్లెటప్పుడు నేను, వచేటప్పుడు నువ్వు అని.


ఇంక మా వూరు ఒక అందమయిన పల్లెటూరు..ఒక పెద్ద చెరువు, చెరువు గట్టు, గట్టు కి అనుకుని వుండే మా తాతయ్య ఇల్లు. వెళ్ళిన వెంటానే మా అమ్మమ్మ కి నాకు కావలసిన ఆట వస్తువుల లిస్టు చదివేవాదిని.. .


మా వూరిలొ వుంది చదువుకునే మా స్నెహితులు భొగి రొజు ఎవరి ఇంటిలొ ఎమి తీసుకు వచ్చి మంటలొ వెయ్యాలి అని ఒక పెద్ద చిట్ట తయరు చెసేవారు. మంట బాగ మండతానికి చిన్న పిడకల దండలు పాలేరు తొ చెప్పి తయారు చెయించేవారు. భొగి రొజు మా వీధిలొ ఎవరి మంట పెద్దగా వస్తాది అని మంచి అనందకరమయిన పొటి వుండెది.ఇంక మగ సన్నాసులు అందరము ఈ పని లొ వుంతే, ఆడవాల్లు మాత్రం గొబ్బెమ్మల హడవిడి లొ పదిపొయేవారు. హైద్రాబదు లొ వుండె మా బావలు గాలిపటాలు తీసుకుని వచేవారు ఎగరెయ్యటానికి.


ఇవే కాదు ఇంక చాల జ్ఞాపకాలు వున్నయి..
- హరిదాసు ఎప్పుడు వస్తాడు అని ఎదురుచూడతం...బియ్యం చెతిలొ పట్టుకొని.

- గాలిపటాలు ఎగరవెస్తు పొశులు కొట్టడం


- అమ్మమ్మ వూరిలొ చెరువు గట్టు మీద చెరుకు తింటు ఆడుకొవటం.

- చెక్కెర కంపని కి వెళుతున్న చెరుకు బండిల నుండి చెరుకు గడలు లాగి తినటం.

- చెరువులొ స్ననము చేస్తు చిన్న చెప పిల్లలని పట్టుకుని సీసా లొ పెట్టి పెంచటం..

- గడ్డిమెట్ల చుట్టు దొంగ-పొలిసు అదుకొవటం


- వూరిలొ పండగకి వెసే వీధి సినెమా కి ప్రొజెక్తరు పక్కన కూర్చుని చూడతం..

- గారేలు, పరవన్నం, బూరేలు, ఇంక ఎన్నొ నొరూరిచే పిండి వంటలు అరగించటం..


ఇప్పుడు వూరికి వెళ్ళి ఇవ్వన్ని అశ్వాదిద్దము అని అనుకున్న ఇవ్వన్ని జరగటం లేదు..కారణం ఎమిటి అంటే, మర మనుషుల్లాగ తయారయిన మనం...ఎదొ పెళ్ళికొ లేక, ఇంక దెనికొ తప్ప, పల్లేటూరు వెళ్ళటం మనేశాము . అసలు భొగి మంట అనేదే మర్చిపొయాము. అభివౄద్ధి, సంపాదన పెరు తొ మనము మనస్సుకి అనందం కలిగించే మదురానుబూతుల్ని ఎన్నొ దూరం చెసుకుంటున్నము అనిపిస్తుంది.

This is my personal opinion.

Thursday, January 04, 2007

ఉబుంటు విప్లవం లొ భాగం అవ్వండి

ఎమిటి ఈ పేరు వినటానికే విచిత్రం గా వుంది అనుకుంటున్నరు కధా? మీకు ఈ వ్యాసం చదివిన తరువాత అశ్చర్యము తొ పాటు మీరు కూడా ఈ విప్లవము లొ పాలుపంచుకొవాలని అనిపించటం ఖాయం. ఎదొ ఆశ పెడుతున్నాను అని అనుకునెరు సుమా,ఎంతమాత్రం కాదు.ఇంక విషయం లొకి వెళదాము..
ఈ కొరిక ఎలాగ మొదలయింది అంటే, మా ఎడాది పాప కి ఒక రొజు ఇంటెర్నెట్టు లొ ఎదొ ఒక చిన్న పిల్లల ప్రొగ్రాము ఒకటి చూపించాను అంతె అప్పటి నుండి నా లాపుటాపు ని కాపాడుకొవటం నా వంతు అయింది. ఇంక ఇలాగ కాదు ఒక చిన్న డెస్కుటాపు కంప్యుటరు కొందాము అని వేట మొదలు పెట్టాను.దానికి తొడు, గత కొన్ని నెలలుగా నాకు ఒక బలీయమయిన కొరిక వుంది. అది ఎమిటి అంటే లినిక్సు ఉపయొగించాలి అని. ఆ కొరిక తీర్చుకొవటానికి అవకాశం వచ్చింది. కొన్ని గంటల పరిశొధన తరువాత ఉబుంటు అనె లినిక్సు operating system డౌను లోడు చెసుకుని సీ.డీ లొ రాశాను. ఒక అసామి తనకు అవసరము లెదని ఒక పాత కంప్యుటరు నాకు ఇచ్చెసాడు (ఊరికె కాదు, డబ్బులకె అండి). తక్షణం ఇంటికి తీసుకుని వచ్చి, నా పరిశొధన తరువాయి బాగం మొదలు పెట్టను. సీ.డీ కంప్యుటరు లొ పెట్టి కూర్చున్నాను ఎదొ ఒక యగ్నానికి కూర్చునట్టు. కాని అశ్చర్యము గా ఒక 15 నిముషములలొ నా కంప్యుటరు వాడటానికి తయారుగా అయింది. ఇంకొ 10 నిముషముల లొ మా పాప ఇంటరునెట్టు తరువాత తనకు ఇష్టమయిన పిల్లల ప్రొగ్రాము చూసింది.

నేను సాఫ్తువెరు కి పెట్టిన మొత్తం ఖర్చు సున్న. అంతా బవుంది, ఇది జరిగి ఒక పది రొజులు అయింది. అప్పటి నుండి నేను ఇంటిలొ కంప్యుటరూ మీద మాములు గా చెసే ఈ-మైయిలు, ఇంటెర్నెటు వాడటం, పాటలు వినటం లాంటి పనులన్ని చక్కగా చెసుకుంటున్నను, అసలు విండొసు కి దీనికి నాకు పెద్ద వ్యత్యాశము లెదు.ఇంకా చలా లాభాలు వున్నయి.మీరు ఆఫిసు కొనక్కరలెదు విడిగా, విండొసు లాగ వైరస్స్ బెడద లెదు, అడుకొవటానికి చలా ఆటలు..చెపుకుంటూ పొతే చలా వున్నాయి .. మరి అందరు ఎందుకు వాడటం లెదు అని అలొచిస్తున్నరా?...తొందరలొ ఇది మంచి ప్రచుర్యం పొందుతుంది తప్పకుండా. చూస్తూ వుండండి. మరి మీరు కూడా ఈ విప్లవం లొ బాగస్తులు అవ్వాలి అంటే ఈ కింద కొన్ని ఎక్కువగా చాల మంది అడిగే ప్రశ్నలు చదవండి..


ప్ర:నేను విందొసు కి అలవాటు పడ్డాను,ఇది ఎంత కష్టం?
జ:మీకు విందొసు తెలుస్తే ఇది ఇంకా సులువు, పెద్ద కష్టం అని పించదు...సైకిలు నుండి మొటరుసైకిలు కి ఎదిగినట్టు వుంటుంది

ప్ర:ఎక్కడ దొరుకుతుంది?
జ:మీకు ఇంటిలొ ఇంటెర్నెట్ వున్న కంప్యుటరు వుంటే,ఈ లింక్ నొక్కండి.మీకు సీ.డీ రాసుకునే సౌలబ్యం వుండాలి

ప్ర: నా కంప్యుటరు లొ పని చెస్తుందా?
జ : నేను అసలు ఎమి మార్చకుండా నాకు పనిచెసింది.మీకు కూడ చేస్తుంది అని అశిస్తున్నాను. ఎందుకు అయినా మంచిది ఒక సారి మీ డాట అంతా దాచుకొండి ఇది ఇనిస్టాలు చెసేముందు.

ప్రస్తుతానికి అవి, మీకు ఇంక ఎమన్నా వుంటే అదగంది, జవాబు ఇవ్వతానికి ప్రయత్నిస్తానుతొందరలొ నా కంప్యుటారు చిత్రాలు పెడతాను