Friday, March 09, 2007

పేదా - గొప్ప

ఈ రొజు మా కార్యలయం లొ ఒకతను భావి భారతీయులకి ఒక ఈ-లేఖ పంపాడు, దాని సారంశం ఎమిటి అంటే "ప్రపంచ మొదటి 500 ల అపర కుబేరుల్లొ మన భారతీయులు 36 మంది వున్నారు అని" అంతే వెంట వెంటనే అయనని వెక్కిరిస్తు ఒక 20-30 సమధానలు వచ్చాయి...దేనికి సంబరం, పేద వాడు ఎమన్న బాగుపడ్డాడ అని కొందరు..మనకి ఎమిటి లాభం అని కొందరు, భారతదెశం లొ వుండి ఎవరు సంపదించలేక పొయరు అని ఇంకొందరు, Human Development Index లొ మనము చాల వెనకపడ్డాము అని ఇంకొందరు..మరి ఎందుకు ఈ గొప్పలు....అలొచిస్తే వాళ్ళు చెప్పే దాంట్లొ కొంత నిజం వుంది అనిపించింది.. కాని , ఇక్కడ భారతదేశం లొ పుట్టి ఇంత గొప్ప వాళ్ళు అయినందుకు వాళ్ళని అభినందించటము లొ తప్పులేదు. ఇందులొ కొందరు మాములు స్థాయి నుండి వారి అకుంటదీక్ష తొ ఈ స్థానానికి ఎదిగారు. వారు నాలాంటి ఎందరికొ ఆదర్శం అవుతారు అనటం నిశ్శందేహం. నా లాంటి వాళ్ళకి ఉద్యొగాలు కూడా ఇచ్చారు. ఒక అంబాని, ఒక మిట్టల్ పట్టుదల ఉండి కష్టపడి కలలు ఎలాగ సార్ధకం చెసుకొవచ్చొ అనేదానికి యువతరానికి ఒక ఉదహరణ గా నిలుస్తారు.
ఇది ఇలాగ వుంచితే, మన దేశం లొ ఆఫ్రికా ఖండం లొ కన్న ఎక్కువ పేదవారు వున్నరు ఆంట. కాని దీనికి వీరిలొ ఏ ఒక్కరిది తప్పు కాదు. వీరి లొ ఏ కోందరు మన నాయకులు అయివుండి వుంటే పరిస్తితి వేరే గా వుండేది ఎమొ?
మన దేశ వెనుకబాటు తనానికి ఒక కారణం ఇక్కడ మనుషులకి ఇచ్ఛే విలువ. మనము మనిషి ప్రణానికి ఎంత విలువ ఇస్తున్నాము అనే దాని మీద ఒక దేశ గొప్పతనము అధారపడి వుంది. మనిషి సంపాదించటానికి ఎంత సౌకర్యం కల్పిస్తున్నము అనేది కాదు ముఖ్యం. నిజమే ఆ లెక్కన చూస్తే మన దేశం లొ మనిషి కాదు కదా ఏ ప్రాణికి కూడ విలువ లేదు. దేశ వనరులకి సరిపొనంతగ వున్న మన జనభా ని తిట్టుకొవలా లేక సాఫ్తువేరు లొ పేరు రావటానికి ఆ జనాభానే ఉపయొగపడింది అని సంతొష పడాలా?

నాకు తెలిసి ఈ క్రింది కొన్ని అంశాల లొ మనము కొంచం అభివృధ్ధి చెందినప్పుడు మనమందరం గర్వపడే రొజు తప్పకుండ వస్తుంది. అప్పుడు ఇంకా ఎంతొ మంది పై జాబితా లొ వుంటారు అనటం లొ ఎటువంటి సందెహం వద్దు.
  1. బాల కార్మికులు సమస్య తగ్గినప్పుడు
  2. అరొగ్య సదుపాయలు అందరికి అందినప్పుడు
  3. కనీసం 5 వ తరగతి కన్న ఎక్కువ అందరు చదివితే
  4. మంచి పౌష్తికాహారం పిల్లలకి అందించగలితే,
  5. మహమ్మరి వ్యాదులు మీద ప్రజలకి అవగాహన కల్పిస్తే
  6. విద్యుత్తు సదుపాయం అభివృద్ది చెందితే,
  7. సమాన న్యాయ వ్యవస్త వుంటే
  8. అడవారికి సమాన హక్కులు కల్పించగలితే
  9. చిన్న పిల్లల మరణాలు అరికట్టగలితే
  10. సమాచర వ్యవస్త(ఇంటెర్నెట్టు) అందరికి అందుబాటులొ వుంటే

Monday, March 05, 2007

పులి ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టూ..

మన 'రూటే వేరు ' మొహన్‌ బాబు గారికి వునట్టుండి సేవ కార్యక్రమాల మీద మనస్సు మళ్ళింది. అది కూడ AIDS వ్యాధి మీద అవగాహన కల్పించటానికి అంట.అప్పుడెప్పుడొ ఒక సారి హాలివుడ్‌ నటుడు రిచర్డ్‌ గెరె 2005 లొ భారత దేశం వచ్చి ఈ అవగాహన సదస్సు పెట్టినప్పుడు రాని అలొచన ఇప్పుడు ఎందుకు వచ్చిందొ?


ఎదొ ఎదుటివాడి మీద కుళ్ళు తొ చెయ్యకుండా, మంచి కొసం చెస్తే మంచిదే.కాని సేవ అని పెరు తొ లెజెండ్రి అయిపొదాము అని రాజకీయ అలొచనలతొ చెస్తే ఇంతకన్న దరిద్రం మరొకటి వుండదు
ఈ విషయం పక్కన పెడితే, ఈయనకి సేవా నిరతి చాలా ఎక్కువ కూడా. ఉదాహరణకి :
బయట సుమతీ శతకాలు చెప్పే ఈయన గారి మీద అప్పుడెప్పుడొ వచిన ఒక వార్త లింకు చూడండి. http://news.bbc.co.uk/2/hi/entertainment/3089455.stm

స్టేజి మీద కి ఎక్కి సినియర్లకి సరయిన సన్మానం జరగలేదు అని చెప్పే ఈయన ఒక సినియర్‌ నటి అయిన జయంతి మీద చెయ్యి చెసుకున్నారట

మరి ఇక్కడ 'title' కి విషయానికి ఎమిటి సంభందం అని అనుకుంటున్నార? ఈ కింద నొక్కండి.
http://thatstelugu.oneindia.in/talk2006/07/chiru-mohan-turns.html