Friday, October 13, 2006

నింగిని తాకిన స్టాకు మార్కెట్ - వాపా లేక బలుపా?



మరొ సారి స్టాకు మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి.నిన్న సెన్సెక్స్ 12736.42 పాయింట్లు వద్ద ముగిసింది.ఈ పెరుగుదల నిజంగా వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందా లేకా కొంత మంది స్టాక్స్ తొ గాంబ్లింగ్ ఆడుతున్నారా? ఓక్కసారి మన ఆర్థిక రంగం పరిస్థితి చూద్దాం.

పొయిన వారం ఇణ్ఫొసిస్ రెండవ త్రైమాస ఫలితాలు మార్కెట్ ని బాగా ప్రభావితం చేసాయి అని చెప్పవచ్చు.సాఫ్టువేర్ కంపేనీలకి ఇంతకన్న మంచి కాలం ఎప్పుడు లేదు.మౌఖిక వసతులకి సంబందించిన కంపేనీలు అన్ని మంచి ఆర్డరులతొ బిజీ గా వున్నయి.సిమెంట్ కంపేనీలు అన్ని సామర్ధ్యానికి మించి పని చెస్తున్నయి.ఆటొమొబిలు రంగం ప్రతి నెల విడుదల చేసే అమ్మకాల సంఖ్యలు చాలా ప్రొత్సాహకరం గా వున్నయి.మొత్తనికి మన ఆర్థిక రంగం మంచి ఆరొగ్యము గా వుంది అని చెప్పవచ్చు. ౠతుపవనాలు కూడ బాగుంటాయి అని వస్తున్న వార్తలు మార్కెట్ ని పాసిటీవ్ గా ప్రభావితం చేస్తున్నయి.దీన్ని బట్టి ఈ పెరుగుదల కొంచం అర్థిక రంగన్ని ప్రతిబింబిస్తున్నా,కొంచం బలుపు కూడ ఉన్నది అని చెప్పలి. బ్రెజిల్, రష్యా తొ పొల్చుకుంటే మన మార్కెట్లు కొంచం వొవర్ గా ఉన్నాయి అన్నది నిజం.

రానున్న వారాల్లొ మరిన్ని పెద్ద కంపనీలు ఫలితాలు ప్రకటిస్తుండటం తొ చాల మంది ప్రొఫిట్స్ బుక్ చెసుకొవటానికి కొనడము తొ ప్రస్తుతం చాల స్టాకులు కొంచం వుండవలిసిన వాల్యు కి అన్న ఎక్కువ గా ఉన్నాయి. సామాన్య రెటైల్ ఇన్వెస్టర్ మార్కెట్ సద్దుమణిగాక మళ్ళి ట్రడింగ్ లొకి ఎంటెర్ అవ్వటం చాల ఉత్తమం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home