Friday, October 13, 2006

రింగు రొడ్డు-క్షమాభిక్ష రాజకీయం

ఆంధ్రప్రదేష్ రాజకీయలు రొజు రొజు కి చిన్న పిల్లల కొట్లాటలు అయి పొతున్నయి. నిన్న మొన్నటి వరకు రింగు రోడ్డు అని, భూమి అని తిట్టుకున్న మన నాయకులు, ఈ రొజు ఇంకొక బొమ్మ దొరికేసరికి పాత విషయము(బొమ్మ)గురించి మర్చిపొయారు.
గౌరు వెంకట రెడ్డి క్షమాభిక్ష ఒక పెద్ద కామెడి సినిమా లాగ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టి అధికారం లొకి వచ్చిన తరువాత చేసిన మొదటి తప్పు ఒక ఖైది కి గవర్నెర్ చేత క్షమాభిక్ష పెట్టించడం. రెండొ తప్పు సుప్రీం కొర్ట్ చివాట్లు పెట్టినా, 'చీ' అని దులుపేసుకొవటం. రాజశేఖర రెడ్డి వారు 'సుప్రీం రాజకీయ దుర్వినియొగం జరిగిందని అనలెదు కధ అని అనటం' వారి వితండవాదానికి ప్రతీకాష్ట.

ప్రస్తుత మన పార్టీల పరిస్తితి :

కాంగ్రెస్ పార్టి ఎమో ఎవరు ఎమన్న మాకు ఎమిటి. అధికారం లొ వున్నము, మా ఇస్ట్టము వచినట్టు చెసుకుంటాము మమ్మలని మాట అనె అధికరం ఎవరికి లేదు అని భావం వచ్చెటట్టు ప్రవర్తిస్తుంది.

తెదెపా వాళ్ళు ఇంక కాంగ్రెస్ ఎప్పుడు తప్పు చెస్తుందా అని కాసుకు కూర్చునట్టు కనిపిస్తుంది. ప్రతిపక్ష పాత్ర గురించి చంద్రబాబు కి ఒకసారి ఎవరన్న చెబుతే బాగుండును. బిజెపి వాళ్ళ సంగతి వారికె అర్థం కావటం లేదు.

టి ఆ రెస్ ఒక రాష్ట్రం కొసం పిచ్చ తప్ప ఆ రాష్ట్రం వస్తె ఎమి చెస్తామొ చెప్పె ఒక వివేకమయిన నాయకుడు లేని పార్టి.

ఒక పక్కన రాష్ట్రం లొ ప్రజలు డెంగ్యు జ్వరాలతొ, చిక్కెన్ గున్య తొ బాధ పదుతుంటె మరొక పక్క వీల్లు చిన్న పిల్లలు లాగ తిట్టుకొవతం కొట్టుకొవటం ఎవరికి అయిన చూస్తే నవ్వుకొవాలొ ఎడవాలొ మన దేశ దుస్తిథి చూసి అర్థం కావటం లేదు.

కనీసం కొత్త ఆశలు తొ వస్తున్న జయ ప్రకాష్ 'లొక్ సత్తా అయిన ప్రజల పార్టి అవుతుంది ఎమో వేచి చూద్దాం.

God ...Where am I being taken too?