Thursday, January 04, 2007

ఉబుంటు విప్లవం లొ భాగం అవ్వండి

ఎమిటి ఈ పేరు వినటానికే విచిత్రం గా వుంది అనుకుంటున్నరు కధా? మీకు ఈ వ్యాసం చదివిన తరువాత అశ్చర్యము తొ పాటు మీరు కూడా ఈ విప్లవము లొ పాలుపంచుకొవాలని అనిపించటం ఖాయం. ఎదొ ఆశ పెడుతున్నాను అని అనుకునెరు సుమా,ఎంతమాత్రం కాదు.ఇంక విషయం లొకి వెళదాము..
ఈ కొరిక ఎలాగ మొదలయింది అంటే, మా ఎడాది పాప కి ఒక రొజు ఇంటెర్నెట్టు లొ ఎదొ ఒక చిన్న పిల్లల ప్రొగ్రాము ఒకటి చూపించాను అంతె అప్పటి నుండి నా లాపుటాపు ని కాపాడుకొవటం నా వంతు అయింది. ఇంక ఇలాగ కాదు ఒక చిన్న డెస్కుటాపు కంప్యుటరు కొందాము అని వేట మొదలు పెట్టాను.దానికి తొడు, గత కొన్ని నెలలుగా నాకు ఒక బలీయమయిన కొరిక వుంది. అది ఎమిటి అంటే లినిక్సు ఉపయొగించాలి అని. ఆ కొరిక తీర్చుకొవటానికి అవకాశం వచ్చింది. కొన్ని గంటల పరిశొధన తరువాత ఉబుంటు అనె లినిక్సు operating system డౌను లోడు చెసుకుని సీ.డీ లొ రాశాను. ఒక అసామి తనకు అవసరము లెదని ఒక పాత కంప్యుటరు నాకు ఇచ్చెసాడు (ఊరికె కాదు, డబ్బులకె అండి). తక్షణం ఇంటికి తీసుకుని వచ్చి, నా పరిశొధన తరువాయి బాగం మొదలు పెట్టను. సీ.డీ కంప్యుటరు లొ పెట్టి కూర్చున్నాను ఎదొ ఒక యగ్నానికి కూర్చునట్టు. కాని అశ్చర్యము గా ఒక 15 నిముషములలొ నా కంప్యుటరు వాడటానికి తయారుగా అయింది. ఇంకొ 10 నిముషముల లొ మా పాప ఇంటరునెట్టు తరువాత తనకు ఇష్టమయిన పిల్లల ప్రొగ్రాము చూసింది.

నేను సాఫ్తువెరు కి పెట్టిన మొత్తం ఖర్చు సున్న. అంతా బవుంది, ఇది జరిగి ఒక పది రొజులు అయింది. అప్పటి నుండి నేను ఇంటిలొ కంప్యుటరూ మీద మాములు గా చెసే ఈ-మైయిలు, ఇంటెర్నెటు వాడటం, పాటలు వినటం లాంటి పనులన్ని చక్కగా చెసుకుంటున్నను, అసలు విండొసు కి దీనికి నాకు పెద్ద వ్యత్యాశము లెదు.ఇంకా చలా లాభాలు వున్నయి.మీరు ఆఫిసు కొనక్కరలెదు విడిగా, విండొసు లాగ వైరస్స్ బెడద లెదు, అడుకొవటానికి చలా ఆటలు..చెపుకుంటూ పొతే చలా వున్నాయి .. మరి అందరు ఎందుకు వాడటం లెదు అని అలొచిస్తున్నరా?...తొందరలొ ఇది మంచి ప్రచుర్యం పొందుతుంది తప్పకుండా. చూస్తూ వుండండి. మరి మీరు కూడా ఈ విప్లవం లొ బాగస్తులు అవ్వాలి అంటే ఈ కింద కొన్ని ఎక్కువగా చాల మంది అడిగే ప్రశ్నలు చదవండి..


ప్ర:నేను విందొసు కి అలవాటు పడ్డాను,ఇది ఎంత కష్టం?
జ:మీకు విందొసు తెలుస్తే ఇది ఇంకా సులువు, పెద్ద కష్టం అని పించదు...సైకిలు నుండి మొటరుసైకిలు కి ఎదిగినట్టు వుంటుంది

ప్ర:ఎక్కడ దొరుకుతుంది?
జ:మీకు ఇంటిలొ ఇంటెర్నెట్ వున్న కంప్యుటరు వుంటే,ఈ లింక్ నొక్కండి.మీకు సీ.డీ రాసుకునే సౌలబ్యం వుండాలి

ప్ర: నా కంప్యుటరు లొ పని చెస్తుందా?
జ : నేను అసలు ఎమి మార్చకుండా నాకు పనిచెసింది.మీకు కూడ చేస్తుంది అని అశిస్తున్నాను. ఎందుకు అయినా మంచిది ఒక సారి మీ డాట అంతా దాచుకొండి ఇది ఇనిస్టాలు చెసేముందు.

ప్రస్తుతానికి అవి, మీకు ఇంక ఎమన్నా వుంటే అదగంది, జవాబు ఇవ్వతానికి ప్రయత్నిస్తానుతొందరలొ నా కంప్యుటారు చిత్రాలు పెడతాను

8 Comments:

Blogger రానారె said...

ఈ సమాచారం తెలిపినందుకు ధన్యవాదాలు. సైకిలు నుండి మోటారుసైకిలుకు అన్నారు, ఎలా?

7:07 PM  
Blogger Unknown said...

మీరు ఇలా ఉబుంటు గురించి ప్రచారం చెయ్యడం బాగుంది.

నేను గత రెండు సంవత్సరాలుగా ఉబుంటు వాడుతున్నాను... చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. అదే గాక ఉబుంటు రేలెఆసెస్ మిగతా లినక్స్ ల లాగా కాకుండా త్వర త్వరగా ఉంటాయి అంటే మీకు ఎప్పుడూ updated సాఫ్ట్‌వేర్ లభిస్తుందన్నమాట

మీకు ఉబుంటు నే నచ్చింది అంటే కుబుంటు ఇంకా బాగా నచ్చుతుంది. లేక పోతే KDE ఇన్‌స్టాల్ల్ చేసుకోండి ఆ interface విండోస్ ని తలదన్నేడిగా ఉంటుంది.

9:53 PM  
Blogger ఉదయ్ భాస్కర్ said...

రమానంద గారు, సైకిలు నుంది మొటారుసైకులు అంటే నా వుద్దేశం సైకిలు నాటు గా తొక్కుతాము కదండి, సైకిలు తొక్కి తొక్కి మొటారుసైకిలు మొదటసారి తొక్కినప్పుడు ఆ ఆనందం వుంటుంది చూడండి, ఎదొ నెను పెద్ద వాడిని అయిపొయాను అని ఒక రకమయిన ఫీలింగ్ ఆ అనుభూతి గురించే నెను చెప్పేది.

నా మాటలు సరిగ్గా అతకకపొతే క్షమించండి

11:47 PM  
Blogger ఉదయ్ భాస్కర్ said...

ప్రవీణ్ గారు,
మీ అభిప్రాయానికి దన్యవాదాలు.నెను కుబుంటు కూడా try చేసాను. కాని ఎందుకనొ ఉబుంటు నా hardware మొత్తన్ని detect చెసి నట్టు కుబుంటు చెయలెక పొయింది

11:50 PM  
Blogger Srini said...

నాకు ఒక చిన్న అనుమానం, ఉబుంటు లో దొరికే ఆఫీస్ అప్లికేషన్ తో తయారుచేసిన వర్డ్ డాక్యుమెంట్ విండోస్ లోని MS Office లో ఓపెన్ అవుతాయా? ఇలా విండోస్ కి, ఉబుంటు కి 2వే కంపాటిబిలిటి వుందా?

12:52 AM  
Anonymous Anonymous said...

World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
world of warcraft power leveling
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
world of warcraft gold,
wow gold,
world of warcraft gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold
buy cheap World Of Warcraft gold s3t6l7ur

2:48 PM  
Blogger Bhãskar Rãmarãju said...

gOS అని ఒకటి ఉంది. అది ఊబుంటు మీద తయ్యారు ఐంది. అదికూడా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించండి. అలానే BERYL అని ఊబుంటుకి విండోస్ మేనేజరు. అది వేసుకుంటే చాలా రంజుగా ఉంటుంది. మీగొట్టం (యూటూబ్) లో ఈ క్లిప్పింగు చూడాండి..
http://www.youtube.com/watch?v=ZD7QraljRfM

భాస్కర్

10:52 AM  
Blogger omar ail said...



Your site is very helpful
http://antiinsects.iwopop.com/
http://antiinsects.mex.tl/
https://antiinsects.1msite.com/
http://7asobi.com/
https://www.prokr.net/ksa/jeddah-water-leaks-detection-isolate-companies/

5:43 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home