Sunday, December 03, 2006

రాములమ్మ-2

మన వీరనారి విజయశాంతి తల్లితెలంగాణ పార్టి కి అసలు ఎవరయిన కేడెర్ వున్నారొ లెదొ తెలియదు కాని తాటాకు చప్పుళ్ళు మాత్రం ఆమె బాగ చెస్తుంది. రాజకీయాలు అంటె సినేమాల్లొ లాగ ఒక రొజులొ కలక్టరు అయిపొవటమొ, లెక పొతె నాలుగు పరుచూరి బ్రదర్సు డయలాగులు చెబుతే సినేమ హాల్లొ చప్పట్లు కొట్టిన ప్రజలు రాజకీయల్లొ కూడా జై జై లొ పలుకుతారు అనుకొవటం అవివేకం. అసలు ఈవిడది తెలంగాణ అవునొ కాదొ కాని మంచి నటి అని మాత్రం ఈ మధ్య ఇస్తున్నా పత్రికా ప్రకటనల్లొ బగా కొట్టుకొచ్చినట్టు కనపడుతున్నాయి. రాజకీయాలని బాగ వంటపట్టించుకున్న ఈవిడ రొజుకొ మాట మాట్లాడుతుంది. ఈవిడ నిజముగా ఒక రాజకీయ అవకాశవాది, తెలంగాణ లొ ఎప్పుదు రాజకీయ వేడి పుడుతుందొ ఎప్పుడే ఈవిడ మాట వినపడుతుంది, లెకపొతే ఈ మేడం గారు చెన్నై లొ ఇంచక్క కాలం గడుపుతూ వుంటారు. ప్రస్తుతం సినెమాలు లేని ఈవిడ వచ్చె కాలం లొ ఆదాయం సంపాదించటం కొసమే తెలెంగాణ ని ఎంచుకున్నారు కాని తెలంగాణా ప్రజలని ఉద్దరిద్దాము అని అయితే కాదు. ఎప్పుడు లెనిది, ఈ సంవత్సరం జరిగిన బొనాలు పండుగ లొ ఈవిడ కనిపించి, TV9 లొ చెన్నై యాస లొ తెలుగు ఒక కొస మెరుపు. తెలంగాణా కు కావలసింది ఇప్పుడు ఒక నిజాయతి, పట్టుదల గల నాయకుడు కాని అవకాశవాదులు, గ్లామర్-తారలు, తల్లులు కాదు. ప్రస్తుతం తెలంగాణా నే వారి వూపిరి అంటున్న నాయకుల్లొ ఒకరు ఎమో పట్టుమని 2 రొజులు కూడ నిరహరదీక్ష చెయ్యలెని వారు ఒకరు, తల్లి కొసం రక్తాభిషెకం చెస్తాము అనె వారు ఒకరు, ఇటలి మేడం కి జలుబు చెసినప్పుడు మనకి తెలంగాణ ఇస్తారు అని మురిసిపొయే చంచా నాయకుడు ఒకరు, ఎప్పుడు చూసిన అందరూ అయన శిష్యులు అంటూ దేముడి మాన్యాలు రాసి ఇచ్చిన పెద్ద మనిషి ఒకరు, మన తల్లి రాములమ్మ ఒకరు.
వీళ్ళని చూసి పొట్టి శ్రిరాములు వుండి వుంటె, సిగ్గుతొ చచ్చిపొయెవారు ఎమొ.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home