నాకు చిన్నప్పుడు నుండి ఒక చిన్న కొరిక వుండెది. మంచి చేతి గడియారం కొనుక్కొవాలి అని. కనిపించిన ప్రతి ప్రకటన ని చూసి నా చేతి కి పెట్టుకున్నట్టు వూహించుకుని మురిసిపొయె వాడిని. మా నాన్నగారు అది గమనించారు ఎమొ, నన్ను ఒక సారి తన పాత ’HMT' ని పెట్టుకుని వెళ్ళమని చెప్పారు. నాకు ఎందుకొ అది చాల మొరటు వాచి లాగ అని పించి వద్దు అన్నను. మరి ఆయన ఎమన్నా అనుకున్నారు ఎమొ కాని, నేను పదవ తరగతి మంచి మార్కుల తొ పాసు అయ్యాను అని చెప్పి ’Timex' కొట్టు కి తీసుకుని వెళ్ళి మంచి చెతి గడియారం బహుమతి గా ఇచ్చారు . నాకు ఇంకా బాగ గుర్తు, కనిపించిన ప్రతి వాడికి మొదట నా గడియారం చూపించి తరువాత దెని గురించి అయినా మాట్లాడెవాడిని. దానిని చాలా జాగ్రత్త గా చూసుకుంటూ వుండేవాడిని. రొజు తడి బట్ట తొ తుడవడం, వర్షం వస్తే అది ఎక్కడ తడిసిపొతాదో అని చెప్పి, ఒక ప్లాస్టిక్ సంచి లొ చుట్టి జెబు లొ పెట్టు కొనేవాడిని.
గిర్రున అయిదు సంవత్సరాలు తిరిగిపొయాయి. ఒక శుభ ముహుర్తాన నాకు ఉద్యొగం రావటం తొ, మా అమ్మ నాకు ఈ సారి 'Titan' గడియారం బహుమతి గా ఇచ్చింది.ఇది కొంచం ఎక్కువ ఖర్చు తొ కొన్నాది. నా మొదటి చెతి గడియారనికి కాలం చెసింది ఇంతలొ. . మరుసటి సంవత్సరం, మా చెల్లి రాఖి పండుగ గుర్తు గా ఇంకొక "SPORT" వాచి ఇచ్చింది. సొ మొత్తం మీద రెండు వాచిలతొ కాలం చాలా వెగంగా నడుస్తుండగా, నెను ఒక "smart phone" కొనటం జరిగింది. నా ఫొను ఒక చిన్న కంప్యుటరు ని మరిపించే లాగ వుంటుంది. దాని తెర మీద ఒక చిన్న గడియారం కూడ వుంది. ఇంకా నా గడియారం లొ లేనివి చాలా వున్నాయి.
ఎదొ చికెన్ గున్యా వచ్చి నట్టుగా నా, రెండు గడియారాలు ఒకే సారి మంచం పట్టాయి, తిరగము అని మొరయించుకుని కూర్ఛున్నాయి. నాకు కూడా, "seven year itch" లాగ, నా కొత్త పెళ్ళం, 'Phone' వచ్చిన తరువాతా, నా పాత వాచిల మీద ప్రేమ తగ్గ్గింది. నెను వాటిని బాగుచేయిద్దాం అనే అలొచన చంపేసుకున్నాను. ఇక్కడ వాటిని బాగుచెయ్యటానికి అయ్యే ఖర్చు తొ మనం మన దేశం లొ ఒక్కళ్ళ ఒక సంవత్సరం చదివించవచ్చు. చేతికి గడియారం బరువు లేకుండా ఒక ఆరు నేలలు గడిచాయి..నెమ్మదిగా నాకు చెతి గడియారం ఉపయొగం అసలు కనిపించటం లేదు. కాని ఈ మధ్య మా శ్రీమతి గారి పొరు ఎక్కవా అయింది, చెయ్యి ’యాస’ గా వుంది , మంచి చేతి గడియారం కొనుక్కొండి అని. మనకేమొ ఇప్పటి వరకు అన్ని బహుమతి గా వచ్చినవే తప్ప కొన్నవు కావు. మరి నాకయితే, అలంకార ప్రాయనికి తప్ప చేతి గడియారం ప్రస్తుత కంప్యుటరు యుగం లొ అనవసరం అనిపిస్తుంది.
ఇప్పుడు పెద్ద ప్రశ్న,మా శ్రీమతి కొరిక మన్నించి, కొత్తది కొనాలా వద్దా?